కాశ్మీరీలను భారత్‌పైకి రెచ్చగొట్టిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కాశ్మీరీలను భారత్‌పైకి రెచ్చగొట్టిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ముజఫరాబాద్: భారత్‌పై పరోక్ష యుద్ధంలో అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన పాకిస్తాన్.. భారత్‌పై పైచేయి సాధించేందుకు ఆఖరికి మళ్లీ కాశ్మీరీలనే వాడుకుంటోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ బహిరంగ సభలో కాశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాశ్మీరీలను అణిచివేస్తోందని.. వారి తరపున ముందుండి పోరాటం సాగించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ క్రమంలోనే తనను తాను కాశ్మీరీల ప్రతినిధిగా అభివర్ణించుకున్న ఇమ్రాన్ ఖాన్... కాశ్మీరీలు భారత్‌ని వ్యతిరేకిస్తారని, భారత్‌లోని నరేంద్ర మోదీ-ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని సర్కార్‌కి వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టి పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతటితో సరిపెట్టుకోని ఇమ్రాన్ ఖాన్.. నరేంద్ర మోదీ కశ్మీరీల సహనాన్ని పరీక్షిస్తున్నారని కశ్మీరీలను మోదీకి వ్యతిరేక వర్గం చేస్తూ అధిక ప్రసంగం చేశారు.
ఈ నెలాఖరున జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వేదికపై కశ్మీరీల స్వరం బలంగా వినిపిస్తానని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. కశ్మీరీల మద్దతు కూడగట్టుకునేందుకు గట్టి ప్రయత్నం చేశారు.