పుల్వామాలో భారత జవాన్లపై దాడి ఘటనపై పాక్ ప్రధాని తొలి సారిగా నోరు విప్పారు.  సౌదీ అరేబియా కాన్ఫరెన్స్ కారణంగా తాను వెంటనే ఈ ఘటనపై స్పందించలేకపోయానని ఇమ్రాన్ ఖాన్ వివరణ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పుల్వామా దాడికి సంబంధించిన వ్యూహం తమ నేలపై రచించలేదు..తమ నేలపై పుట్టిన వారికి  ఈ దాడితో సంబంధంలేదు ... అలాంటిది తమపై ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు... సరే ఇలాంటి దాడులకు పాల్పడితే తమ వచ్చే ఏమైన ప్రయోజనం ఉందా అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. 


తమది కొత్త మెండ్‌సెట్ తో ఉన్న ప్రభుత్వమని..దేశాన్ని స్టెబిలిటీవైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాస్తవానికి తమది కూడా ఉద్రవాద బాధిత దేశమని.. గత 15 ఏళ్లలో 70 వేల మంది చనిపోయరని..అలాంటిది తామ ఉగ్రవాదానికి ఎలా పెంచి పోషించగలమని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. 


కశ్మీర్ లో జరిగిన ప్రతి ఘటనను తమపై రుద్దడం సరికాదన్నారు. స్థానికంగా ఏర్పడిన పరిస్థితుల వల్లే ఈ దాడి జరిగి ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని భారత్ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు.


ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని ఇందులో తమ దేశం ప్రవేయం లేదని వివరణ ఇచ్చేందుకు తప్పితే ఈ దాడిని ఖండించడం కాని..గతంలో జరిగిన ఉగ్రవాదలు ఘటన ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా ఈ తప్పును భారత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. 


పుల్వామా దాడి విషయంలో ప్రపంచ దేశాలు పాక్ ను దోషిగా చూస్తున్న సమయంలో  ఇమ్రాన్ ఖాన్ స్పందించడం గమనార్హం. అంతర్జాతీయం తన వాయిస్ ను తెలియజెప్పే ప్రయత్నం చేశారు . తము తప్పులను బయటపెట్టకుండా.. దాన్ని భారతపై నెట్టాలని ఇమ్రాన్ ప్రయత్నం చేశారు.