Pakistan Launched Missile: భారత్ కు పోటీగా ఏదో చేయబోయి పరువును పోగుట్టుకుంది పాకిస్తాన్. ఇటీవలే భారత రక్షణ శాఖకు చెందిన ఓ క్షిపణి.. పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పెద్ద ఎత్తున రచ్చ చేసింది. మిస్సైల్ పొరపాటున అటువైపు పడిపోయిందని ఇండియా డిఫెన్స్ శాఖ ప్రకటన చేసినా వివాదం చేసింది. సంయుక్త దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది. 
మిస్సైల్ ఘటనతో ఇరు దేశాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే  భారత్ కు పోటీగా  తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. కాని అది విఫలమైంది. ఇమ్రాన్ సర్కార్ పరువు గంగలో కలిసింది. పాక్‌లో కొన్ని స్థానిక మీడియా సంస్థల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని జంషోరో ప్రాంతంలో గురువారం ఓ గుర్తుతెలియని వస్తువు గాల్లోకి ఎగిరి కింద పడింది. 


ఆ వస్తువు క్షిపణి అని తర్వాత తేలింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సింధ్‌లోని టెస్ట్‌ రేంజ్‌ నుంచి పాకిస్తాన్ ఓ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అయితే ట్రాన్స్‌పోర్టర్‌ ఎరెక్టర్‌ లాంఛర్‌లో సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేచింది. కానీ కొద్ది సెకన్లకే ఆ మిసైల్‌ గురి తప్పింది. కాసేపటికే కూలిపోయింది. 


పాక్‌లోని కొన్ని మీడియా ఛానల్స్‌ ఈ ఘటనను ప్రసారం చేశారు. అది అధికారులు మాత్రం స్పందించడం లేదు. అయితే అది క్షిపణి కాదని, సాధారణ మోర్టార్‌ ట్రేసర్‌ రౌండ్‌ అని స్థానిక అధికారులు కొందరు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన భారత క్షిపణి ఘటనకు ప్రతిస్పందనగానే పాక్‌ ఈ ప్రయోగం చేపట్టి ఉంటుందని అక్కడి మీడియా ఏజెన్సీ ఒకటి వెల్లడించింది.


Also Raed: Prithvi Shaw Yo Yo Test: యో-యో టెస్ట్‌లో పృథ్వీ షా ఫెయిల్‌.. అయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతాడు!!


Also Read: RRR First Review: ఇండియా బాక్సాఫీస్‌ షేక్ అవుతుంది.. 3 వేల కోట్లు పక్కా! ఇది రాసిపెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ తొలి రివ్యూ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook