Pakistan Train Accident: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం, 30 మందికి పైగా మృతి
Pakistan Train Collision: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే పట్టాలపై వెళ్తూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో పెను విషాదం జరిగింది. ప్రాణ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Pakistan Train Collision: ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొనడంతో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుకుందని పాక్ మీడియా రిపోర్ట్ చేసింది.
దక్షిణ పాకిస్తాన్‌లో మిలాట్ ఎక్స్‌ప్రెస్ రైలు, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రేతి మరియు దహార్కి రైల్వే స్టేషన్ల మధ్యలో ఘోట్కి వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన (Pakistan Train Accident) చోటుచేసుకుందని సీనియర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉమర్ తుఫెయిల్ వెల్లడించారు. పాకిస్తాన్ (Pakistan) మీడియా జియో న్యూస్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది.
Also Read: ITR New website: ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం, కొత్త ఫీచర్లు ఇవే
మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పాకిస్తాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. Pakistan Train Collision ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook