Flight crashed in Afghanistan : విమానం కూలి 83 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ విమానం కూలిపోయిన ఘటనలో 83 మంది దుర్మరణం చెందారు. ఆఫ్గనిస్తాన్‌లోని హెరాత్ నుంచి కాబూల్‌కి బయల్దేరిన విమానం మార్గం మధ్యలోనే కూలిపోయింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ విమానం కూలిపోయిన ఘటనలో 83 మంది దుర్మరణం చెందారు. ఘజ్ని ప్రాంతంలోని డే యాక్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక కౌన్సిల్ సభ్యుడు ఖలిక్దాద్ అక్బరి తెలిపారు. ఘటనాస్థలికి ప్రత్యేక సహాయ బలగాలను పంపించాలని అక్బరి విజ్ఞప్తి చేసినట్టుగా టోలో న్యూస్ అనే స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. తాలిబాన్ల ఆధీనంలో ఉండే ప్రాంతంలోనే ఆరియానా ఆఫ్ఘాన్ ఎయిర్‌లైన్స్ కూలిపోయినట్టు మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫ్గనిస్తాన్‌లోని హెరాత్ నుంచి కాబూల్‌కి బయల్దేరిన విమానం మార్గం మధ్యలోనే కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు చెలరేగడంతో తాలిబాన్లే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మిర్రర్ మీడియా సంస్థ కథనం పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.