Passport Rankings 2024: పవర్ ఫుల్ పాస్‌పోర్టుల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా?
World Passport Rankings 2024: 2024కిగానూ శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఆరు దేశాలు తొలి స్థానంలో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. మరి ఇండియా ర్యాంక్ ఎంతంటే?
World's Most Powerful Passport Rankings 2024: ఈ ఏడాదికి సంబంధించి శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా రిలీజైంది. వరల్డ్ వైడ్ గా ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శక్తివంతమైనవి(Powerful Passports)గా నిలిచాయి. తొలి స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాలు ఉన్నట్లు ‘హెన్లీ పాస్‌పోర్టు నివేదిక(Henley Passport Index) వెల్లడించింది. ఈ ఆరు దేశాల పాస్‌పోర్టులు ఉన్నవాళ్లు 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లవచ్చు. అయితే ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. భారత్ పాస్‌పోర్టు ఉన్నవారు 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. గత ఏడాది ఈ ఇండెక్స్ లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. దీని ప్రకారం 59 దేశాలకు మాత్రమే వెళ్లే వీలుండేది.
గత ఐదేళ్లుగా శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్, జపాన్ టాప్ ర్యాంకులో ఉంటూ వస్తున్నాయి. కానీ ఈ సారి మరో నాలుగు దేశాలు వాటి సరసన చేరాయి. ఇక రెండో స్థానంలో దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నిలిచాయి. వీటి పాస్ పోర్టులతో 193 దేశాలకు వెళ్లొచ్చు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్టులతో 192 దేశాలు చుట్టిరావచ్చు. ఈసారి లిస్ట్ లో అఫ్గానిస్థాన్ చివరి స్థానం(104)లో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 28 దేశాలు మాత్రమే వెళ్లొచ్చు. దాయాది దేశం పాకిస్తాన్ 101వ స్థానంలో ఉంది.
టాప్-10 పవర్ పుల్ పాస్‌పోర్ట్‌లు ఇవే..
1. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ (194 గమ్యస్థానాలు)
2. ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ (193 గమ్యస్థానాలు)
3. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ (192 గమ్యస్థానాలు)
4. బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్ (193 గమ్యస్థానాలు)
5. గ్రీస్, మాల్టా, స్విట్జర్లాండ్ (190 గమ్యస్థానాలు)
6. చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోలాండ్ (189 గమ్యస్థానాలు)
7. కెనడా, హంగరీ, యునైటెడ్ స్టేట్స్ (188 గమ్యస్థానాలు)
8. ఎస్టోనియా, లిథువేనియా (187 గమ్యస్థానాలు)
9. లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (186 గమ్యస్థానాలు)
10. ఐస్లాండ్ (185 గమ్యస్థానాలు)
Also Read: Earthquake today: ఢిల్లీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి