Aliens left a woman Pregnant: గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా... లేవా... ఇదొక అంతులేని చర్చ... దశాబ్దాలుగా దీనిపై ఎన్నో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహాంతర జీవుల నుంచి సిగ్నల్స్ అందుతున్నాయని.. ఫ్లయింగ్ సాసర్స్ కనిపించాయని... ఇలా ఏలియెన్స్‌కు సంబంధించి రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చినప్పటికీ శాస్త్రీయంగా అవేవీ నిరూపితం కాలేదు. తాజాగా గ్రహాంతర జీవులకు సంబంధించి మరో సంచలనాత్మక కథనం వెలుగులోకి వచ్చింది. గ్రహాంతర జీవుల  కారణంగా ఏకంగా ఓ మహిళ గర్భం దాల్చినట్లు అందులో పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌కి చెందిన డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (DIA) నుంచి సేకరించిన డాక్యుమెంట్స్‌లో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది సన్' వెల్లడించింది. సమాచార అభ్యర్థన స్వేచ్చ ద్వారా డీఐఏ నుంచి ఈ రిపోర్ట్‌ను సేకరించినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. ఈ రిపోర్ట్‌లో గ్రహాంతర జీవులు మనుషులతో శృంగారం జరిపినట్లు, పలు సందర్బాల్లో మనుషులను అపహరించినట్లు, మరికొన్ని సందర్భాల్లో గ్రహాంతర జీవుల ఫ్లయింగ్ సాసర్స్ కారణంగా కొందరు గాయపడినట్లు పేర్కొన్నారు.


ఐదు సందర్భాల్లో మనుషులతో గ్రహాంతర జీవుల శృంగారం : 


ఐదు సందర్బాల్లో గ్రహాంతర జీవులు మనుషులతో శృంగారం జరిపినట్లు ఆ  రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆ ఐదుగురు ఎవరు.. ఏమిటనే విషయాలు ఆ రిపోర్టులో పేర్కొనలేదు. ఇక గ్రహాంతర జీవులకు సంబంధించిన ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) వంటి వాటి ద్వారా కొంతమంది గాయపడినట్లుగా కూడా అందులో పేర్కొన్నారు. ఫ్లయింగ్ సాసర్స్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా కొంతమంది మెదడు, నరాలు, ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్లు అందులో తెలిపారు. పెంటగాన్ సంస్థ చాలాకాలంగా గ్రహాంతర జీవులపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ విషయాలను గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు.


Also Read: Drugs Case: డ్రగ్స్ దందాలో కేసీఆర్ సన్నిహితుల హస్తం... బండి సంజయ్ సంచలన ఆరోపణలు


Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook