Plane crashed in USA today, Plane crashed videos goes viral: క్యాలిఫోర్నియా: అమెరికాలోని శాండిగోకు సమీపంలో ఓ చిన్న విమానం ఇళ్లపై కూలిన ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. విమానం కూలిన అనంతరం చెలరేగిన మంటల్లో ఎయిర్ క్రాఫ్ట్‌తో పాటు ఘటనాస్థలంలోని రెండు ఇళ్లు, అక్కడే పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాండిగోలోని మోంట్‌గోమెరి ఫీల్డ్ నుంచి అరిజోనాలోని యుమకు బయల్దేరిన సి340 ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ సెస్నాలో (C340 twin-engine Cessna) సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ ఆ విమానాన్ని జిల్లెప్సీ ఫీల్డ్‌కి సమీపంలోని భూభాగంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలోనే కూలిపోయిందని (Aircraft crashed in USA) ప్రాథమిక సమాచారం అందుతోంది.

కూలిన చిన్న విమానంలో ఆరు సీట్లు ఉండగా.. దుర్ఘటన జరిగిన సమయంలో ఆందులో ఎంత మంది ఉన్నారనే స్పష్టమైన సమాచారం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై శాండిగో కౌంటి షెరిఫ్ డిపార్ట్‌మెంట్ (San Diego) స్పందిస్తూ.. ఘటనపై అమెరికా పౌర విమానయాన విభాగం, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేపడతాయని తెలిపింది. 

విమానం కూలిపోయిన అనంతరం చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Plane crash videos goes viral) అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.