PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో తీరిక లేకుండా గడుపుతున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజులు పలు కార్యక్రమాలలో ప్రధాని మోదీ పొల్గొంటున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ఈశ్వరీపూర్ గ్రామంలో ఉన్న జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఇరు దేశాలకు సరిహద్దులో నైరుతి దిశలో ఉన్న శక్తిరా జిల్లాలోని ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి సంప్రదాయ బద్దంగా ఆహ్వానం పలికారు. ఆలయం పూజారి మంత్రోచ్ఛరణల నడుమ ఆయన దేవతకు ప్రార్థనలు చేశారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం 51 శక్తి పీఠాలలో జెషోరేశ్వరి కాళీ కాలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని రికార్డులు చెబుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. మోదీ(PM Narendra Modi) పర్యటన నేపథ్యంలో అక్కడ నిరసన, ఆందోళన పెల్లుబికుతోంది.


Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31తో ముగియనున్న తుది గడువు



గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న తొలి పర్యటన ఇది కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ సరిహద్దులో నెలకొన్ని కాళీ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని, తన షెడ్యూల్‌ వివరాలు రెండు రోజుల కిందటే ఆయన వెల్లడించారు. చివరగా 2015లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన సమయంలో ఢాకేశ్వరీ ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. 


కాగా, బంగ్లాదేశ్‌కు 1971, మార్చి 26న స్వాతంత్య్రం లభించింది. పాకిస్తాన్(Pakistan) నుంచి విడిపోయి వారికి స్వాతంత్య్రం సిద్ధించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారతదేశ ప్రధాని మోదీని పొరుగు దేశ అధినేతలు ఆహ్వానించారు. భారత్ సాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ పలు కార్యక్రమాలలో గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు.


Also Read: Flight Charges: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణం ఇక మరింత భారం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook