PM Modi wishes America: న్యూఢిల్లీ:  జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు.. స్వేచ్ఛ, మానవ సమానత్వాన్ని ఆచరిస్తూ జరుపుకునేదే స్వాతంత్య్ర దినోత్సవం’’ అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read: Lunar Eclipse 2020 July: చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటి ? ఎలా చూడొచ్చు ?
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది: డొనాల్డ్ ట్రంప్
ప్రధాని మోదీ ట్వీట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ‘‘నా స్నేహితునికి ధన్యవాదాలు, అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది.’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. 
  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..