అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి అవుతున్న హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ పై భారత్ ఎక్కువ ట్యాక్స్ వేస్తుందని అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే తాము మాత్రం భారతదేశంతో పాటు పలు దేశాల నుండి అమెరికాకి దిగుమతి అవుతున్న బైక్స్ పట్ల జీరో ట్యాక్స్ విధానం అనుసరిస్తున్నామని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ తాము కూడా మనసు మార్చుకుంటే.. భారత్ నుండి వచ్చే బైక్స్ అన్నీ కూడా అమెరికాకి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇటీవలే అమెరికాలో జరిగిన స్టీల్ ఇండస్ట్రీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ మాటల సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవలే మోదీ భారతదేశానికి వచ్చే హార్లీ డేవిడ్ సన్ వంటి అమెరికన్ బైక్స్ పై విధిస్తున్న సుంకాన్ని 75 శాతం నుండి 50 శాతం తగ్గించామని చెప్పారు. అయితే ఇంకా తగ్గించాలని తాము భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు. 


"ప్రతీ సంవత్సరం భారత్ నుండి ఎన్నో బైకులు అమెరికాకి దిగుమతి అవుతున్నాయి. వాటి ముక్కూ, మొహం కూడా మాకు తెలియదు. కానీ మేం జీరో ట్యాక్స్ విధానాన్ని అనుసరిస్తున్నాం." అని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అందుకే పన్ను విధానం అనేది పారదర్శకంగా.. ఇరు దేశాలు కూడా విధించేటట్లు ఉండాలని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.


అలా జరిగే వాణిజ్యాన్నే ఫెయిర్ ట్రేడ్ అంటారని.. ప్రస్తుతం జరిగే వాణిజ్యాన్ని ఫ్రీ ట్రేడ్ అంటారని ట్రంప్ తెలిపారు. ఇటీవలే భారత్‌కు చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) దిగుమతి అయ్యే మోటార్ బైక్స్ మీద ట్యాక్స్ తగ్గించడంతో.. విదేశీ బైకుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే