మాడ్రిడ్‌: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రాజవంశీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల యూకేకు చెందిన ప్రిన్స్ చార్లెస్‌కు కోవిడ్19 పాజిటీవ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజవంశానికి చెందిన ఓ యువరాణి కరోనా కాటుకు బలయ్యారు. స్పెయిన్‌కు చెందిన ప్రిన్సెస్ మరియా థెరిసా కరోనా (86) వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు ప్రిన్స్ సిక్స్టో ఎన్రిక్ డే బార్డన్, ద డ్యూక్ ఆఫ్ అరన్ జ్యుయేజ్ వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇండియాలో తొలి 'కరోనా' టెస్ట్ కిట్ ఇదిగో..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువరాణి మరియా థెరిసా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు సమాచారం. యువరాణి థెరిసా 1933 జులై 28న స్పెయిన్ రాజకుటుంబంలో జన్మించారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మరియా థెరిసా స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-6 సోదరి. ఫ్రాన్స్‌లో విద్యాభ్యాసం చేసిన మరియా థెరిసా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించేవారు. ఆమె చేసిన సామాజిక కార్యక్రమాలతో ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా ప్రసిద్ధి గాంచారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


కాగా, ప్రపంచ వ్యాప్తంగా 30వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇటలీలో మరణాలు 10వేలు దాటిపోగా, స్పెయిన్ లో దాదాపు 6000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వైరస్ పుట్టుకొచ్చిన చైనా మాత్రం ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఫ్రాన్స్, తదితర దేశాలు తీవ్ర మరణాలను చవిచూస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!


హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ