Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం
Russia Elections Once Again Putin Landslide Victory: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. నలుగురు ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లు పొంది ఐదోసారి అధ్యక్షుడిగా పని చేయనున్నారు.
Putin Victory: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం పొందారు. రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లతో సంచలన విజయం సాధించారు. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న ఆయన మరో ఆరేళ్ల పాటు కొనసాగనున్నారు. మార్చి 15 నుంచి మొదలైన ఎన్నికల పోలింగ్ 17వ తేదీతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఊహించని భారీ మెజార్టీతో పుతిన్ ఘన విజయం పొందారు. నలుగురితో పోటీపడిన ఆయన సంచలన విజయం సాధించారు. రెండోస్థానంలో నిలిచిన నికోలయ్ ఖరితోనోవ్‌కు 4 శాతం ఓట్లు మాత్రమే రాగా.. మిగతా వారికి అత్పల్ప ఓట్లు లభించాయి.
Also Read: Penny Wong: మహిళను పెళ్లి చేసుకున్న మహిళా మంత్రి.. తొలి స్వలింగ పెళ్లితో రికార్డు
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఉండగా.. రష్యాలో ప్రజలు మాత్రం అతడి పాలనను మెచ్చుకుంటున్నారు. పోలింగ్ చివరిరోజు 17న ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో గంపగుత్తగా పుతిన్‌కు ఓట్లు పడ్డాయి. అయితే పుతిన్ వ్యతిరేక వర్గం ఎన్నికల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు, ప్రమాదకరమైన ద్రావణం వంటివి పోసి ఎన్నికల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో విదేశీయులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో రష్యా ప్రజలు ఓటు వేశారు. ఈ విజయంతో ఆరేళ్ల పదవీకాలంలో ఉండనున్న పుతిన్ సుదీర్ఘ కాలం పాలించిన నేతగా నిలవనున్నాడు. 29 ఏళ్లు పాలించిన జోసెఫ్ స్టాలిన్ (1924-1953) రికార్డును చెరిపేసి పుతిన్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
Also Read: Nikki Haley: నిక్కీ హేలీ సంచలన నిర్ణయం.. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి నిష్క్రమణ
పుతిన్ రాజకీయ ప్రస్థానం
రాజకీయాల్లోకి అనుకోకుండా పుతిన్ వచ్చారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన పుతిన్ 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో చేరారు. ఆ సంస్థ వివిధ హోదాల్లో పని చేసిన పుతిన్ 1991లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్‌గా పుతిన్ తొలి పదవి చేపట్టారు. 1998లో రష్యా భద్రతా దళానికి అధిపతిగా పుతిన్ నియమితుడయ్యాడు. 1999లో ప్రధానమంత్రిగా 46 ఏళ్ల వయసులో పుతిన్ బాధ్యతలు చేపట్టాడు. అదే సంవత్సరం అనూహ్యంగా అధ్యక్ష పీఠాన్ని పుతిన్ అధిష్టించాడు. రెండు పర్యాయాలు అధ్యక్ష పదవిలో కొనసాగిన పుతిన్ వరుసగా మూడోసారి ఆ పదవిలో కొనసాగే అవకాశం లేదు.
2008లో మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2012, 2018లో మరోసారి అధ్యక్షుడిగా పుతిన్ ఎంపికయ్యాడు. తాజాగా 2024 ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్ ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నాడు. 24 ఏళ్లుగా ప్రధానమంత్రి, అధ్యక్షుడిగా పుతిన్ దేశానికి సేవలందిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook