బ్రిస్బేన్: ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్ రూమ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి వాష్ రూమ్‌లోని టాయిలెట్‌లో కొండ చిలువ ఉండటం చూసి షాకయ్యాడు. బాధితుడి కుటుంబాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని నివ్వరపోయేలా చేసిన ఈ ఘటన శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌‌లో చోటుచేసుకుంది. ఆ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని సురక్షితంగా కొండచిలువను వెలికి తీసిన బ్రిస్బేన్ స్నేక్ క్యాచర్స్.. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఇదే విషయాన్ని బ్రిస్బేన్ స్నేక్ క్యాచర్స్ తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసుకున్నారు. బ్రిస్బేన్ స్నేక్ క్యాచర్స్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌కు.. సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది. ఈ పోస్ట్ చూసిన అనంతరం అనేక మంది తమ ఇళ్లలోని టాయిలెట్స్ ని కూడా పరిశీలించుకుని వినియోగించుకున్నట్టు ఆ పోస్ట్ కింద కామెంట్స్ బాక్సులో పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఎలుకలను వేటాడే క్రమంలో పాములు ఇలా డ్రైనేజీ పైపుల్లోకి ప్రవేశిస్తాయని, అలాగే ఈ కొండ చిలువ కూడా టాయిలెట్ వరకు వచ్చి ఉంటుందని బ్రిస్బేన్ స్నేక్ క్యాచర్స్ సభ్యుడు లేలార్ అభిప్రాయపడ్డారు. ఆయనే ఈ కొండచిలువను టాయిలెట్ లోంచి వెలికి తీసి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.