Qatar government: భారతదేశం దౌత్యపరంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గూఢచర్యం నేరంతో మరణశిక్షపొందిన 8మంది మాజీ భారత నేవీ అధికారులకు ఖతార్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి వదిలిపెట్టింది. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది. ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖతార్‌లో పనిచేస్తున్న 8 మంది మాజీ భారత నేవీ అధికారులు ఆ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు దీనిపై విచారణ జరిపిన ఖతార్ ప్రభుత్వం ఆ 8మందికి మరణశిక్ష విధించింది. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 మందిపై గూఢచర్యం ఆరోపణలపై 2023 అక్టోబర్ 26వ తేదీన ఖతార్ ఫస్ట్ ఇన్‌న్టన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది. మరణశిక్ష పొందిన 8 మందిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగపాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. 


ఈ 8 మందికి ఖతార్ ప్రభుత్వం విధించిన మరణశిక్షను రద్దు చేయాలంటూ భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి భారత ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలో తీసుకుని ఆ 8 మందికి క్షమాభిక్ష ప్రసాదించింది. ఖతార్ ప్రభుత్వం. వెంటనే 8 మందిని విడుదల కూడా చేసింది. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపింది ఇండియా. 


Also read: LPG Gas Cylinder Changes: గ్యాస్ సిలెండర్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ , కలిగే ప్రయోజనాలేంటి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook