Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ ను ఏడు దశాబ్దాలకు పైగా పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Queen Elizabeth-2 Funeral) ముగిశాయి. సోమవారం రాత్రి లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటిష్ రాచరిక మర్యాదలు, సంప్రదాయాల నడుమ ఈ అంతక్రియలు నిర్వహించారు. రాణికి తుదివీడ్కోలు పలికేందుకు ప్రపంచ నేతలు, చక్రవర్తులు తరలివచ్చారు. లక్షలాధి మంది ప్రజలు పౌరులు తమ రాణికి కన్నీటి వీడ్కోలు పలికారు. కింగ్ చార్లెస్ మరియు ఇతర సీనియర్ బ్రిటీష్ రాజ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన అంతిమ సంస్కారాల్లో...  గతేడాది కన్నుమూసిన రాణి భర్త ఫిలిప్‌ సమాధి పక్కనే ఎలిజబెత్‌ భౌతికకాయాన్ని ఉంచారు. అంతక్రియల అనంతరం  2 నిమిషాలపాటు అందరూ మౌనం పాటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (draupadi murmu), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు వివిధ దేశాల అధినేతలు,  2 వేల మంది అతిథుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాణికి నివాళులు అర్పించారు. కామన్వెల్త్‌ ప్రధాన కార్యదర్శి బారోనెస్‌ ప్యాట్రిసియా, బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ బైబిల్‌ వాక్యాలను పఠించి, కీర్తనలు అలపించారు. రాణి అంతిమ యాత్ర సందర్భంగా లండన్‌లోని బిగ్‌ బెన్‌ గంటను ఎలిజబెత్‌-2 96 ఏళ్లు జీవించినదానికి గుర్తుగా నిమిషానికి ఒకసారి చొప్పున 96 సార్లు మోగించారు. క్వీన్‌ ఎలిజబెత్‌ తన 96వ ఏట స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో ఈ నెల 8న మరణించిన సంగతి తెలిసిందే. 


Also Read: Queen Elizabeth II: అశ్రునయనాల మధ్య బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook