రష్యా ( Russia ) ప్రతిపక్షనేత ఆలెక్సీ నావాల్నీ ( Alexei Navalny )  స్పోక్ పర్సన్ కీలక అంశాలను వెల్లడించాడు. ఆలెక్సీ నావాల్నీ ప్రస్తుతం సైబీరియాలోని ఒక ఆసుపత్రిలో ఐసియులో ఉన్నాడు. ఆయనపై విషప్రయోగం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  Shocking: 14 ఏళ్లకే తల్లైన రష్యా అమ్మాయి..10 ఏళ్ల అబ్బాయే తండ్రట


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలెక్సీ నావాల్నీ మాస్కో వెళ్లే విమానంలో ఉండగా ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఒమ్స్క్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. రష్యాలో యాంటి కరప్షన్ ఉద్యమాన్ని సాగించే లీడర్ గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Vladimir Putin ) పై ఘాటుగా విమర్శలు చేయగల సత్తా ఉన్న ఏకైక నేత కూడా అతనే.



Bayern Victory:  ఏడేళ్ల తరువాత ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో బయేర్న్


ఆలెక్సీ నావాల్నీ అధికార ప్రతినిధి కియరా యార్నేమ్ తన ట్విట్టర్ ఖాతాలో దీని గురించి తాజా సమాచారం ప్రపంచంతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు అని వెంటిలేటర్ పై ఉన్నాడు అని పలు రకాలు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలెక్సీ నావాల్నీపై విష ప్రయోగం జరిగింది.. అతను ICU లో ఉన్నాడు అని ట్వీట్ చేశారు. ఆలెక్సీ నావాల్నీకి కావాలని ఎవరో విషం ఇచ్చారు అని ఆరోపించారు. Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి


ప్రస్తుతం పోలీసులు, ఇన్వెస్టిగేటర్లు ఆలెక్సీ నావాల్నీ ఆరోగ్యం గురించి వివిధ ప్రశ్నలను వైద్యులను అడుగుతున్నారు అని తెలిపారు కియరా. టీలో కావాలనే ఎవరో విషయం కలిపారు అని,  ఆయన ఉదయం నుంచి కేవలం టీ మాత్రమే తీసుకున్నారు అని తెలిపారు. Viral Video: పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై భీకర పోరు



ఆలెక్సీ నావాల్నీ నడిపిస్తున్న అవినీతి నిరోధక ఉద్యమానికి న్యాయపరమైన సహకారం అందించే వ్యాచెస్లావ్ గిమాడి ( Vyacheslav Gimadi ) స్పందిస్తూ ఆలెక్సీ నావాల్నీపై విష ప్రయోగం వెనక రాజకీయం హస్తం ఉంది అనేది స్పష్టంగా తెలిసిన విషయం అని... ప్రజల కోసం ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు.