birth control for roof rats in new York: సాధారణంగా మన ఇళ్లలో ఎలుకలు కన్పిస్తే చిరాకుగా అన్పిస్తు ఉంటుంది. అవి రాత్రి పూట మన కిచెన్ లో తిరుగుతూ నానా రచ్చ చేస్తుంటాయి. అంతే కాకుండా..ఎలుకల వల్ల చాలా మంది వ్యాధులకు కూడా గురౌతుంటాయి. ఎలుకలు తిన్న ఆహారంను తింటే.. కొన్ని సార్లు మనిషి చనిపోయే రిస్క్ కూడా ఉంటుందని కూడా చెప్తుంటారు. అయితే.. న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాలలో ఎలుకలు అక్కడి వాళ్లకు చుక్కల్ని చూపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడ చూసిన కూడా  ఎలుకలు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి. ఏకంగా అక్కడి ప్రభుత్వం ఎలుకలకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని డిసైడ్ అయ్యాయంటే.. ఎలుకలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. అర్థం చేసుకొవచ్చు.


న్యూయార్క్ నగరంలో ఎలుకలు పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. అక్కడ 3 మిలియన్ల ఎలుకలు ఉన్నాయని, భవనాలు, సబ్‌వే స్టేషన్‌లు ఎలుకలతో నిండిపోయాయని సమాచారం . ఎలుకలు ఒకసారి డెలీవరీలో.. 13 పిల్లల వరకు జన్మనిస్తాయంట. అదే విధంగా.. ఆ పిల్లలు ఒక నెలలోపు పెరిగి పెద్దవై..  పునరుత్పత్తి చేయగలవు. ఆ తల్లి ఎలుక మరల..24 గంటలలోపు మళ్లీ జతకట్టడానికి రెడీగా  ఉంటుంది.


పర్యవసానంగా, ఒక మగ,  ఆడ ఒక సంవత్సరంలో 15,000 ఎలుకలకు జన్మనిస్తాయనిన తెలుస్తుంది. అందుకే అక్కడ ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అక్కడ ప్రజలు ఎలుకల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లు సంపాదిస్తున్న డబ్బులన్ని ఎలుకలకు చంపడానికి ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారంట. దీంతో ఎలుకల్ని చంపడంపై జంతు ప్రేమికులు కూడా అక్కడ కుదరదని చెప్పారంట.


Read more: Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..


అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా ఎలుకలకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి నిర్ణయించారంట. తినే పదార్థాలలో గర్భనిరోధక మాత్రలను కలిపి.. ఎలుకలు తినేలా చేయాలి. దీని వల్ల  ఎలుకలు పునురుత్పాదక శక్తిని కోల్పోతాయి. దీనివల్ల ఎలుకల సంతతి క్రమంగా తగ్గిపోతుందనిన అక్కడి వారు భావిస్తున్నారంట. ప్రస్తుతమైతే.. దీన్ని పైలేట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని కూడా అక్కడి అధికారులు సైతం ఆదేశాలు జారీచేశారంట.. దీంతో ఈ ఎలుకల గోల కాస్త వార్తలలో నిలిచింది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.