Russia Bomb Attacks: ఉక్రెయిన్‌లో రష్యా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఓ స్కూలుపై జరిపిన బాంబు దాడుల్లో 60 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఆయ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమౌతోంది. రష్యా సైనిక, బాంబు దాడులు కొనసాగుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ స్కూలుపై రష్యా బాంబు దాడులు జరిపింది. ఇందులో 60 మంది వరకూ మరణించారు. ఈ స్కూలు బేస్‌మెంట్‌లో 90 మంది వరకూ ఉన్నారు. వరల్డ్ వార్ 2లో జర్మనీ నాజీల్ని ఎదుర్కోవడంలో రష్యా విజయం సాధించిన రోజు ఇది. 


బిలోహోరివ్కాలోని స్కూలు బాంబు దాడులకు గురైంది. ఇది లుహాన్స్కా ప్రావిన్స్ పరిధిలోనిది. బాంబు దాడుల్నించి స్కూలులో ఉన్న 30 మందిని రక్షించారు. బేస్‌మెంట్‌లో ఉన్న దాదాపు 60 మంది మరణించినట్టు తెలుస్తోంది. రష్యా సైనికులు చిన్నారుల్ని కూడా హత్య చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ డే ఉత్సవాల్లో భాగంగా రష్యా..ఉక్రెయిన్‌లోని పోర్ట్ సిటీ మరియోపోల్‌ను దాదాపుగా ఆక్రమించేసింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కొన్ని సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ పౌరులు తలదాచుకుంటున్న స్కూలు భవనాలు, షెల్టర్లపై కూడా రష్యా అమానవీయంగా బాంబు దాడులు చేస్తోంది. 


Also read: The Rock Diamond Auction: వేలంలోకి రానున్న అతి పెద్ద వజ్రం ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook