రష్యన్ కరోనా వ్యాక్సిన్ ( Russian corona vaccine ) అన్ని అనుమతుల్ని దాటుకుని పంపిణీకు సిద్దమవుతోంది. వచ్చేవారంలో పంపిణీకు..వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ గా స్పుత్నిక్ వి ( Sputnik v ) ను రష్యా రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాల్ని దాటేందుకు మూడో దశ ప్రయోగాల్ని ఏకంగా 40 వేల మందిపై భారీగా చేపట్టింది రష్యా. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ ( Gamaleya institute ) ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. మరి కొద్దిరోజుల్లోనే అంటే సెప్టెంబర్ 10-13 మధ్యన అనుమతుల ప్రక్రియ ముగుస్తుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. అనంతరం తొలి బ్యాచ్ విడుదలై..సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించింది. 


వ్యాక్సిన్ ( Vaccine ) కోసం ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని..ముందుగా హై రిస్క్ గ్రూపులకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. వైద్యసిబ్బంది, వృద్దులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే ఇప్పుడు కూడా పరీక్షలపై స్పష్టత లేకుండానే ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read: Google Good News: ఉద్యోగులకు ఇకపై 4 డే వీక్