Moscow: కొవిడ్ రష్యాను వణికిస్తోంది. వైరస్ ధాటికి రష్యాలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 973మంది కొవిడ్‌(Covid Deaths)తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24గంటల్లో రష్యాలో 28,190 కొత్త కేసులు(Corona Cases in Russia) వచ్చాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 7.8 మిలియన్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2,18,345మంది కొవిడ్‌తో మృతి చెందినట్టు వివరించారు. యూరప్‌(Europe)లో అత్యధిక కొవిడ్‌ మరణాలు రష్యాలోనే సంభవించడం గమనార్హం. వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం వల్లే గత నెల నుంచి ప్రారంభమైన కొవిడ్‌ కేసులు, మరణాలు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చాయన్న విమర్శల సైతం ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి.  


Also read: Covaxin: పిల్లలకు త్వరలో కొవాగ్జిన్‌ టీకా...అనుమతించిన నిపుణుల కమిటీ!


వ్యాక్సిన్ పంపిణీలో వెనుకబాటు!
గత నెల రోజుల నుంచి రష్యాలో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇందుకు వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగడమే కారణమని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌(First Covid Vaccine)ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడిపోయింది. దాదాపు 14.6కోట్ల జనాభా కలిగిన రష్యాలో ఇప్పటివరకు కేవలం 33శాతం మందికి మాత్రమే టీకా తొలి డోసు అందగా.. 29శాతం మందికి పైగా రెండు డోసులూ తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


కొవిడ్ నిబంధనలు గాలికి..
కరోనా వైరస్‌(Coronavirus) వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌(Lock Down) విధించేందుకు క్రెమ్లిన్‌ నిరాకరిస్తోంది. కొవిడ్‌ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయడంపై నిర్ణయాధికారాలను ప్రాంతీయ అధికారులకే అప్పగించింది. రష్యా(Russia)లోని పలు ప్రాంతాల్లో భారీ జన సమూహ కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా(Vaccination) తీసుకున్న వారితో పాటు ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు లేదా కొవిడ్ నెగెటివ్‌ నివేదిక చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. 


మరోవైపు, మాస్కో(Moscow), సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సహా పలు నగరాల్లో జనజీవనం సాధారణంగానే కొనసాగుతోంది. వ్యాపారాలు యథాతథంగా నడుస్తున్నాయి. మాస్క్‌ ధరించాలన్న నిబంధనలు(Covid rules) అంత కఠినంగా అమలు కాకపోవడం అక్కడి ప్రజలు/ప్రభుత్వాల ఉదాసీన వైఖరినికి నిదర్శనంగా చెప్పొచ్చు. వైరస్‌ని కట్టడిచేసే చర్యల్లో భాగంగా మాస్కో  నగరంలో అధికారులు షాపింగ్‌ మాల్స్‌లో ఉచితంగా కొవిడ్‌ పరీక్షలను విస్తరించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook