Russia-Ukraine War: ఉక్రెయిన్, రష్యా మధ్య రోజు రోజుకూ ముదుదురోంది. ఉక్రెయిన్ నుంచి ఇలాగే ప్రతిఘటన ఎదురైతే  రష్యా అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడవచ్చని పెంటగాన్ హెచ్చరించింది. హైపర్‌సోనిక్ క్షిపణులను వినియోగించిన రష్యా.. తప్పనిసరి పరిస్థితుల్లో  అణ్వాయుధాలను కూడా వాడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన మొదట్లోనే అణ్వాయుధ  దాడులకు సిద్ధంగా ఉండాలని పుతిన్ హెచ్చరించడంతో నాటో సభ్యదేశాలకు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో యూకే తన ట్రైడెంట్‌ ఖండాంతర క్షిపణులకు అమర్చే అణు వార్‌హెడ్లను ట్రక్కులపై ఉంచి కీలక ప్రాంతాలకు తరలించడం చర్చనీయాంశమవుతోంది.


అణ్వాయుధ దాడి జరిగినప్పుడు అవలంభించాల్సిన విధానాలపై కసరత్తులు చేయాలని పుతిన్‌ తన  సైన్యంలోని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చాలా నిస్పృహలో ఉన్న పుతిన్ అన్నంత పని చేస్తారేమోనని నాటో దేశాలను అనుమానిస్తున్నాయి.  ఇప్పటి వరకూ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోనే దాడులు చేస్తూ వచ్చిన రష్యా.. ఇప్పుడు పోలెండ్ సరిహద్దు నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. 


దీంతో అప్రమత్తమైన నాటో దేశాలు యూకే లోని అల్మెర్మస్టొన్‌లోని అణ్వాయుధాల డిపో నుంచి దాదాపు నాలుగు నుంచి ఆరు అణు వార్‌ హెడ్లను రాయల్‌ నేవీ ఆయుధ డిపోకు తరలించారు ఈ వార్‌హెడ్లను బ్రిటన్‌కు చెందిన ట్రైడెంట్‌ క్షిపణులకు అమర్చి ప్రయోగించవచ్చు. ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా మాదిరిగానే బ్రిటన్ వార్‌హెడ్లను బయటకు తీయడం గమనార్హం. 


మొత్తాన్ని అగ్ర రాజ్యాల దృష్టి అంతా తమ అణ్వాయుధాలపై పడడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముదిరి ఎక్కడ అణ్వాయుధ యుద్ధంగా మారుతుందో అని ఆందోళన చెందుతున్నాయి.


Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!


Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook