Russia Ukraine War: కుమార్తెతో విడిపోతూ..వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ తండ్రి, వీడియో వైరల్
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ముద్దుల కూతురితో విడిపోతున్నందుకు ఓ తండ్రి వెక్కివెక్కి ఏడుస్తున్న హృదయ విదారక దృశ్యమది. లెట్స్ హ్యావ్ ఎ లుక్..
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ముద్దుల కూతురితో విడిపోతున్నందుకు ఓ తండ్రి వెక్కివెక్కి ఏడుస్తున్న హృదయ విదారక దృశ్యమది. లెట్స్ హ్యావ్ ఎ లుక్..
ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించిన తరువాత..రష్యా దాడుల్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నగరాల్లోని సైనిక స్థావరాల్ని రష్యా టార్గెట్ చేస్తోంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసినట్టు రష్యా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 24 ఉదయం తొలి దాడి తరువాత చాలా వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వస్తున్నాయి. ఇందులోంచి ఒక ఎమోషనల్ వీడియో బాగా వైరల్ అవుతోంది. హృదయాన్ని తట్టి లేపుతుంది. కాస్సేపు చూస్తే చాలు మీరు కూడా ఉద్వేగానికి లోనవుతారు.
యుద్ధమనేది ఓ అవాంఛనీయ ఘటన. విషాదానికి, మృత్యుకేళికి పరాకాష్ఠ. యుద్ధం వల్ల ప్రజలు ప్రాణాలు పోవడమే తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. తమ ప్రాణాల్ని, కుటుంబ సభ్యుల ప్రాణాల్ని కాపాడటమనేది అతి కష్టమైన పని. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో అటువంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. చిన్నారి ముద్దుల కూతురిని ఓ తండ్రి అతికష్టంగా విడిచిపెడుతూ వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న దృశ్యమిది. ఈ వీడియోలో అటు తండ్రి, ఇటు ఆ చిన్నారి ఇద్దరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ట్విట్టర్‌పై ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వైరల్ అవడం ప్రారంభమైంది. అప్పుడే 3 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
వీడియో చూస్తే కన్నీరు ఆపుకోలేరు
ఓ తండ్రి తన కుటుంబానికి వీడ్కోలు చెబుతూ..రష్యా సైనికులతో పోరాడేందుకు తానుండిపోతాడు. ఈ వీడియోకు ఉన్న క్యాప్షన్ ఇదే. ఈ వీడియో చూసిన తరువాత చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. ఈ తండ్రిని, ఉక్రెయిన్ దేశాన్ని ఆ భగవంతుడు రక్షించు గాక అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కుటుంబంతో ఈ తండ్రిని త్వరగా కలుపు భగవంతుడా అటూ మరో వ్యక్తి కామెంట్. నిజంగానే ఈ వీడియోలో అంతటి ఎమోషన్ ఉంది. చిన్నారి కుమార్తెను సేఫ్‌ప్లేస్‌కు తరలిస్తూ..ఏడుస్తుంటే...ఆ చిన్నారి కూడా తండ్రికి దూరం కాలేక ఏడుస్తున్న అత్యంత వేదనాభరిత దృశ్యమిది. ఇద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే..చూసేవారికి కూడా ఏడుపొచ్చేస్తోంది.
Also read: Ukraine vs Russia: హింసను తక్షణమే ఆపండి.. పుతిన్‌ను కోరిన ప్రధాని మోదీ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook