Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించేసింది. ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా బాంబు దాడులకు పాల్పడుతోంది. యుద్ధం తమ ఉద్దేశం కాదని చెప్తూ వచ్చిన పుతిన్.. అకస్మాత్తుగా ఉక్రెయిన్‌పై దాడికి దిగారు. యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు పుతిన్ గట్టి హెచ్చరికలు కూడా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అంతేకాదు, మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని.. ఉక్రెయిన్‌ను సైనిక రహితం చేయడం కోసమేనని తెలిపారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లిట్యా తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నాయకత్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.



ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఇప్పుడు యురోపియన్ యూనియన్‌కు దగ్గరవడం రష్యాకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. ఉక్రెయిన్‌ని తమతో చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా అమెరికా, నాటోని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌ నాటో పక్షం చేరవద్దని.. అది తటస్థంగానే ఉండాలని అంటున్నారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్ డిమాండ్లను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ద్వారా పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై దాడికి పూనుకున్నారు.


Also Read: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం, రష్యా బాంబు దాడులు


Also read: Ukraine Crisis: ఉక్రెయిన్ లో కమ్ముకున్న యుద్ధమేఘాలు.. స్వదేశానికి చేరుకున్న 242 భారతీయులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook