Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ఉక్రెయిన్​పై రష్యా బాంబుల దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజధాని నగరం కీవ్ బాంబులతో మోతతో తల్లడిల్లుతోంది. బాంబుల దాడదుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లో భారత రాయబార కార్యాలయం ఖాళీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాత్కాలికంగా ఉక్రెయిన్​కు సంబంధించిన భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్​కు తరలించినట్లు వెల్లడిచింది. రోజు రోజుకు ఆందోళనలు పెరిగి పోతున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వివరించింది.


'ఉక్రెయిన్​లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు దృష్ట్యా ఉక్రెయిన్​లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంకంగా పోలాండ్​కు తరలించాం. తదుపరి పరిణామాలను బట్టి పరిస్థితి అంచనా వేస్తాం.' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.



ఇవాళ ఉదయమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సమీక్ష జరిగినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఇందులో ఉక్రెయిన్​లోలో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి, ఆపరేషన్ గంగాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని.


Also read: Capital Punishment: సౌదీలో సంచలనం.. ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష


Also read: China Coronavirus: చైనాలో మళ్లీ అలజడి, చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook