Cannibal Couple in Russia: రష్యాలో దారుణం చోటు చేసుకుంది. రష్యాలోని క్రాస్నొదర నగరంలో నివాసముంటున్న దిమిత్రీ బక్షీవ్(35), అతని భార్య నతాలియా(42) 20 సంవత్సరాలుగా దాదాపు 30 మందిని చంపి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచుకొని తింటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుకోకుండా, ఒక రోజు భవన నిర్మాణ కార్మికుడు రోడ్డుపై వెళ్తుండగా.. అతడికి ఒక సెల్ ఫోన్ కనపడింది. ఆ ఫోన్ లో ఉన్న ఫోటోస్ చూడగానే బయపడి పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ లో దిమిత్రీ బక్షీవ్ మానవ శరీర భాగాలను నోట్లో పెట్టుకొని తింటున్నట్టు ఉన్న ఆ ఫోటోను చూసిన  పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు


Also Read: Bengaluru Building Collapse: కళ్లముందే కుప్పకూలిన మూడంతస్థుల భవనం, వీడియో వైరల్


పోలీసులు వీరి అపార్ట్మెంట్ లో తనికీ చేయగా.. విస్తురపోయే నిజాలు బయటకి వచ్చాయి.. వారి ఇంట్లో మానవ శరీర భాగాలు, ఫ్రిజ్జ్ లో దాచిన మనిషి మాంసం, మనిషి మాంసంతో వండిన వంటకాలు దొరికాయి. ఇంటి చుట్టూ ఉన్న ప్రాణంగంలో, బేస్మెంట్ లో మానవ శరీర భాగాలు కనుగొనబడ్డాయి.


ఈ జంట మనుషులను చంపటం, ముక్కలు - ముక్కలుగా చేసి తినటమే కాకూండా, మానవ మాంసంతో వంటలు, వివిధ రకాల డిష్ లను తయారు చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయాలను పెంచుకొని, డిన్నర్, డేటింగ్ అని చెప్పి ఇంటికి రప్పించుకుంటారు. భోజనాలలో, డ్రింక్స్ లో మత్తు పదార్థాలు కలిపి తినబెడతారు. స్పృహ కోల్పయాక వారిని చంపి, ముక్కలు, ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకుంటారు. 




Also Read: MAA elections 2021: 'మా' ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ...నామినేషన్‌ వేసిన ప్రకాశ్‌ రాజ్‌ అండ్‌ టీం


ఏదేమైనా, దక్షిణ రష్యాలోని క్రాస్నోడార్‌కు చెందిన ఈ జంట, చేసిన ఒక హత్యను మాత్రమే అధికారులు నిర్ధారించగలిగారు. ముక్కలు చేసిన మానవ శరీర భాగాలతో దిమిత్రీ బక్షీవ్ సెల్ ఫోన్ లో సెల్ఫీ లు తీసుకోవటం, ఆ ఫోన్ వేరొకరికి దొరికి పోలీసులకు సమాచారం ఇవ్వటం ద్వారా నరమాంస భక్షకుల జంట గురించి బయటకి తెలిసింది 


మొదట నరమాంస భక్షకుల జంటను విచారించగా...  ఒక మహిళ మృతదేశం చూసాము... ఆమె శరీర భాగాలతో సెల్ఫీ తీసుకున్నామని పోలీసులను బురిడీ కొట్టించటానికి ప్రయత్నించారు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొత్తం విషయం బయటకి వచ్చింది 


తదుపరి విచారణలో, వీరిద్దరూ కలిసి "1999 నుండి కనీసం 30 మంది బాధితులను వేటాడి, కిడ్నాప్ చేసి, చంపి -తినడం" లో పాల్గొన్నారని ఒప్పుకున్నట్లు తెలిసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి