Russian Plane Crashes Into Apartments in Yeysk City Near Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రష్యాలో ఒక రష్యన్ సైనిక విమానం జనావాసాల్లో కూలిపోయింది, షాకింగ్ కలిగించే ఈ ఘటన పశ్చిమ రష్యాలోని యేస్క్‌(Russian city of Yeysk) నగరంలో జరిగింది. యేస్క్‌ లో ఒక ఆర్మీ విమానం బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌ ను ఢీకొట్టి కూలిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల ప్రకారం విమానం కూలిపోయే కొద్దిసేపటి ముందు పైలట్ విమానం నుంచి దూకేసినట్టు చెబుతున్నారు. విమానం నుంచి జారిపోయిన ఒక పారాచూట్ కనిపిస్తూ ఉండడంతో అక్కడి నుంచి పైలట్ జంపయ్యాడని అంటున్నారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగిందని, ప్రమాదానికి గురైన ఫైటర్ జెట్ సుఖోయ్-34 అని చెబుతున్నారు. పశ్చిమ రష్యాలోని యేస్క్‌ నగరం అజోవ్ సముద్రం ఒడ్డున ఉంది.


ఆ సముద్రానికి మరొక వైపు ఉక్రెయిన్ తీరం ఉందని అంటున్నారు. ఇక సోమవారం సాయంత్రం సమయంలో విమానం అపార్ట్మెంట్ లపై పడింది. ఇక విమానం పడిపోయిన వెంటనే, భయంకరమైన బ్లాస్ట్ జరిగినట్టు వైరల్ అయిన వీడియోలలో కనిపిస్తోంది. విమానం అలా డ్యాష్ ఇచ్చిన క్రమంలో 9 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. ఒక రష్యన్ టాస్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, నగరం నలుమూలల నుంచి అగ్నిమాపక దళ వాహనాలు అలాగే హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి మంటలు ఆర్పేందుకు చేరుకున్నాయి.



ఈ ఘటనలో క్షతగాత్రులు, మృతుల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అయితే ఇంకా బయటకు రాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం, ఇది సుఖోయ్-34 మీడియం రేంజ్ ఫైటర్ బాంబర్ విమానం అని, ఈ విమానం సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ నుండి శిక్షణ కోసం బయటకీ వెళ్లిందని అంటున్నారు. రష్యన్ మీడియా కథనాల ప్రకారం ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అంటున్నారు.


ఇక ఈ అంశం గురించి  రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, 'విమానం నివాస ప్రాంతాల్లో ఒక ప్రాంగణంలో కూలిపోయిందని, ఈ విమానం కూలిన ప్రదేశంలో దానిలో ఉన్న ఫ్యూయల్ వలన మంటలు మరింతగా వ్యాపించాయని అంటున్నారు. 9 అంతస్తులలోని భవనంలోని ఐదు అంతస్తులు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయని చెబుతున్నారు. ఆ భవనం పైభాగంలోని అపార్ట్‌మెంట్‌స్ కు భారీ నష్టం వాటిల్లింది.


ఈ ఘటన వలన 45 అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి. ఫైటర్ జెట్ కూలిన ఘటనపై సీరియస్‌గా ఉన్న రష్యా దర్యాప్తునకు ఆదేశించడమే కాక క్రిమినల్ ఛార్జ్స్ పెట్టి విచారణ చేపట్టాలని రష్యా నిర్ణయించింది. ఇక దీనిపై క్రిమినల్ విచారణ జరుపుతామని దేశ విచారణ కమిటీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.  


Also Read: Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..


Also Read: Nigeria Floods: దశాబ్ద కాలంలో చూడని మహా వరద.. ఏకంగా 603 మంది మృతి.. నిరాశ్రయులుగా 13 లక్షల మంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook