భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. భారత్ - పాకిస్థాన్‌ను కలిపేందుకు తానూ, షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోలేదని సానియా మీర్జా అంది. ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సానియా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 'మేమేదో భారత్-పాకిస్థాన్‌ను కలపడానికి పెళ్లి చేసుకున్నామని చాలామంది అపోహ పడుతున్నారు. ఇది నిజం కాదు.' అని చెప్పింది సానియా. ఏడాదికోసారి అత్తగారింటికి వెళ్తానని.. వాళ్లు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారని  చెప్పింది. ఆ దేశమంతా తనను వదినా అని పిలుస్తుందని చెప్పుకొచ్చింది. తనపై పాక్ ప్రజలు చూపిస్తున్న అభిమానం మాదిరే.. తన భర్త షోయబ్ మాలిక్‌పై భారత్ ప్రజలు ప్రేమ చూపిస్తారని.. ఆ అభిమానమే మాలిక్‌పై ప్రేమగా మారిందని సానియా తెలిపింది.


కాగా సానియా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. భవిష్యత్తులో మీ బిడ్డను భారత్ లేదా పాకిస్థాన్ ఏ దేశం తరపున ఆడిస్తారు? అని అడగ్గా.. స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకోవడం లేదని.. గొప్ప డాక్టర్‌గా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది.