Saudi new rule: సౌదీ దేశస్థులు ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోకూడదు
Saudi new rule: సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సౌదీ దేశస్థులు ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోకూడదిక. ఆ దేశాలేంటి..ఎందుకీ కొత్త నిబంధన.
Saudi new rule: సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సౌదీ దేశస్థులు ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోకూడదిక. ఆ దేశాలేంటి..ఎందుకీ కొత్త నిబంధన.
ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా(Saudi Arabia) మరో రెండు ఇస్లామిక్ దేశాలపై పెళ్లిళ్ల విషయమై నిషేధం విధించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాల మహిళల్ని సౌదీ దేశస్థులు పెళ్లి చేసుకకూడదనే నిబంధనతో కొత్త నిబంధన (Ban on marriages with foreign women ) తీసుకొచ్చింది. ప్రస్తుతం సౌదీలో ఈ నాలుగు దేశాలకు చెందిన మహిళలు దాదాపు 5 లక్షల వరకూ ఉన్నారు. ఈ విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే కఠినతరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మక్కా డైలీలో ఈ కొత్త నిబంధన గురించి ప్రచురితమైంది. విదేశీ మహిళల్ని వివాహం చేసుకోకుండా తమ దేశంలోని మగవారిని నియంత్రించేందుకే ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లిచేసుకోవాలనుకుంటే..ముందు సౌదీ ప్రభుత్వం (Saudi government)నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత మ్యారేజ్ దరఖాస్తుల్ని సమర్పించాలి. ఒకవేళ అప్పటికే విడాకులు తీసుకుంటే ఆరు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే డైవోర్స్(Divorce) తీసుకున్న ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకోకూడదు.
మరోవైపు దరఖాస్తుదారులు 25 ఏళ్లకు పైబడి ఉండాలి. స్థానిక జిల్లా మేయర్ సంతకం చేసిన డాక్యుమెంట్లను , ఇతర అవసరమైన పత్రాల్ని అందించాలి. అంతేకాదు ఫ్యామిలీ కార్డు తప్పనిసరి. దరఖాస్తుదారుడికి ఇదివరకే పెళ్లై ఉంటే..ఆ భార్య దివ్యాంగురాలనో లేదా దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతుందనో లేదా సంతానానికి అర్హురాలు కాదనో నిరూపించే ఆసుపత్రి డాక్యుమెంట్ అందించాలి. హఠాత్తుగా ఈ కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చిందో అర్ధం కాక అక్కడి మగవారు సందిగ్దంలో ఉన్నారు. కేవలం తమ దేశానికి చెందిన మహిళల్నే పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించే క్రమంలో ఈ నిబంధన తీసుకొచ్చినట్టు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సహా ఇతర దేశాల రాజకీయాల ప్రభావం కూడా కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.
Also read: Chris Gayle Thanks India: భారత ప్రజలకు, PM Modiకి ధన్యవాదాలు తెలిపిన క్రిస్ గేల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook