Saudi Arabia to lift travel ban: భారత సహా మరో ఐదు దేశాల ప్రయాణికులు తమ దేశంలోకి రాకుండా విధించిన ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైంది సౌదీ అరేబియా. డిసెంబర్ 1 నుంచి ఈ సడలింపులు అమలులోకి రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్​తో పాటు ఆంక్షల సడలింపు పొందనున్న దేశాల జాబితాలో ఇండోనేషియా, బ్రెజిల్​, వియత్నాం, ఈజిప్టు, పాకిస్థాన్​లు (Saudi travel Ban on India) ఉన్నాయి.


రెండు డోసుల వ్యాక్సిన్​  తీసుకున్న ఆయా దేశాల ప్రయాణికులను సౌదీ అరేబియాలోకి వచ్చేందుకు అనుమతించాలని అంతర్గత వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ దేశంలోకి వచ్చే ముదు 14 రోజుల క్వారెటైన్​ నిబంధను కూడా ఎత్తివేయనుందని సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం.. ఐదు రోజులు క్వారెంటైన్ తప్పనిసరి కానున్నట్లు తెలుస్తోంది.


సౌదీ ట్రావెల్ బ్యాన్ ఎందుకు చేసింది?


ఈ ఏడాది ఆరంభంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిన (Corona cases) కారణంగా.. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది సౌదీ అరేబియా. ముఖ్యంగా ఇండియా, ఇండోనేషియా, ఈజిప్ట్​, పాకిస్థాన్, అర్జెంటీనా, టర్కీ, బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్.. వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.


ఆయా దేశాల్లో కరోనా పరిస్థితులను బట్టి ఆంక్షలు సడలిస్తూ వస్త్తోంది (Saudi travel Ban lifting) సౌదీ. భారత్​లో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంక్షల సడలింపు దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చింది.


అయితే ఇప్పటి వరకు ప్రయాణ ఆంక్షలు విధించినా.. వైద్య సిబ్బంది, రాయబారుల రాకపోకలకు మాత్రం అనుమతినిచ్చింది సౌదీ.


ఇటీవలే అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా..


అగ్ర రాజ్యం అమెరికా కూడా ఇటీవలే భారత్ సహా పలు దేశాల ప్రయాణికులపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి అమరికాకు సాధారణ ప్రయాణికుల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


టీకా తీసుకున్న ప్రయాణికుల వ్యాక్సిన్ రిపోర్ట్, కనీసం 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతినిస్తోంది అమెరికా.


టీకా తీసుకోని వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల వ్యాక్సిన్​ వేసుకోవడం తప్పనిసరి అనే నిబంధనను కూడా పెట్టింది.


ఆస్ట్రేలియా కూడా ఇటీవలే విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలు ఎత్తివేసింది. వ్యాక్సినేషన్ పూర్తయిన వీసా హోల్డర్లకు ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణాలు చేసేందుకు అవకాశం కల్పించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook