Saudi Aid To Pak: అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​కు సౌదీ అరేబియా భారీ సాయం అందించనుంది. 4.2 బిలయన్​ డాలర్ల సాయం అందించనున్నట్లు సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రకటించింది. ఈ వారం సౌదీలో పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan).. ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్​ సల్మాన్​(Saudi Prince Mohammad bin Salman)తో చర్చలు జరిపిన మూడు రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. సాయంలో భాగంగా.. పాకిస్థాన్ కేంద్ర బ్యాంకులో 3 బిలియన్ డాలర్లను సౌదీ డిపాజిట్ చేయనుంది. మరో 1.2 బిలియన్​ డాలర్లను ఈ ఏడాది రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులకు ఫైనాన్స్ చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:US: తొలి 'ఎక్స్‌'’ జెండర్‌ పాస్‌పోర్టు జారీ చేసిన అగ్రదేశం


పాకిస్థాన్​(Pakistan)కు 2018లోనే సౌదీ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. విదేశీ మారక నిల్వల కోసం మరో 3 బిలియన్​ డాలర్ల చమురు సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో తీసుకున్న 3 బిలియన్ డాలర్లలో 2 బిలియన్​ డాలర్లను పాక్ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్​ ఖాన్ మూడు రోజుల సౌదీ పర్యటన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయి.


తాజా సాయానికి గానూ సౌదీ యువరాజుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కష్టకాలంలో ఉన్న తమ దేశాన్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలంటూ ట్వీట్​ చేశారు. సౌదీ ఆర్థిక సాయంతో పాకిస్థాన్ రూపాయి(Pak Rupee) కోలుకుంటుందని ఇమ్రాన్ ఆర్థిక సలహాదారు శౌకత్​ తరిణ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీ ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని శౌకత్ స్పష్టం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook