నరమేథం సృష్టించిన సైనికుడు హతం
థాయ్‌లాండ్‌లో పట్టపగలే నరమేథం సృష్టించాడు ఓ సైనికుడు. ముఖానికి మాస్క్ వేసుకుని పౌరులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి .. రచసీమ పట్టణంలో కాల్పులకు తెగబడ్డాడు.
థాయ్‌లాండ్‌లో పట్టపగలే నరమేథం
విచక్షణారహితంగా ప్రజలపైకి కాల్పులు
రచసీమ పట్టణంలో కాల్పుల కలకలం
ఉన్మాద సైనికుడిని హతమార్చిన భద్రతా బలగాలు
థాయ్‌లాండ్‌లో పట్టపగలే నరమేథం సృష్టించాడు ఓ సైనికుడు. ముఖానికి మాస్క్ వేసుకుని పౌరులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి .. రచసీమ పట్టణంలో కాల్పులకు తెగబడ్డాడు. రోడ్లపై వెళ్తున్న వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ వ్యక్తి .. ఓ నగల దుకాణాన్ని అధీనంలోకి తీసుకుని ప్రజలను భయపెట్టాడు. లోపల ఉండి.. అందరినీ బంధించాడు. కదిలితే కాల్చిపారేస్తానని హెచ్చరించాడు.
భద్రతా దళాలు పట్టుకునేందుకు ప్రయత్నించినా .. జ్యువెలరీ షాపులో వినియోగదారులను అడ్డం పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే అతన్ని పోలీసులు హతమార్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని జక్రపంత్ తోమ్మాగా గుర్తించారు. అతని వయసు దాదాపు 32 సంవత్సరాలు ఉంటుంది. గతంలో అతడు థాయ్‌లాండ్ మిలిటరీలో పని చేసినట్లు తెలుస్తోంది.
కానీ అతడు ప్రజలపైకి విచక్షణారహితంగా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది.. ? అతని మానసిక స్థితి సరిగ్గా ఉందా ..? అతడు ఉన్మాదిలా ప్రవర్తించడానికి కారణాలేంటి..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాల్పుల్లో పలువురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు పోలీసులు .. ఉన్మాదిని కాల్చి వేయడంతో .. రచసీమ పట్టణంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు.