Women Eating Dead Husband Ashes: చనిపోయిన భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ.. వైరల్ స్టోరీ
బ్రిటన్ కు చెందిన కాసీ అనే మహిళ సీన్ అనే వ్యక్తిని 2009 లో పెళ్లి చేసుకుంది, భర్త మరణం తరువాత రోజు అతడి చితాభస్మాన్ని తింటుందట.. ఇదీ నిజం అండి బాబు!! ఆ కథేంటో మీరే చూడండి
Women Eating Dead Husband Ashes: సాధారణంగా మనలో చాలా మందికి మద్యం, సిగరెట్ లేదా డ్రగ్స్ వంటి అలవాట్లు ఉంటాయి, వాటిని వదిలేయటం చాలా కష్టం. మరి కొంత మందికి ఫోన్, సోషల్ మీడియా, ఫోన్ లో గేమ్స్ వంటివి వ్యసనంగా మారటం చూస్తాము. కానీ బ్రిటన్ లో ఒక మహిళకు 'మరణించిన భర్త చితాభస్మం' తినటం అలవాటుగా మారిందట...
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కి చెందిన కాసీ అనే మహిళ సీన్ అనే వ్యక్తిని 2009 లో పెళ్లి చేసుకుంది. సీన్ ఆస్తమా కారణంగా మరణించటంతో వారి అన్యోన్యంగా దాపత్యంలో అకస్మాత్తుగా విషాదం నెలకొంది. మాములుగా భార్య-భర్తల్లో ఎవరైనా చనిపోతే భాదతో పూర్తీ జీవితానని నెట్టుకొస్తారు లేదా ఇష్టం ఉన్నవాటిపైనా ఎక్కువ సమయాన్ని కేటాయించి ఆ భాద నుండి బయటకి రావటానికి ప్రయత్నిస్తారు.
Also Read: Samantha Defamation Case: కోర్టును ఆశ్రయించిన సమంత..యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!
కానీ కాసీ మాత్రం, తన భర్త తనతోనే ఉండాలని.. "భర్త మరణం తరువాత చితాభస్మాన్ని ఎక్కడికి వెళ్లిన తనతో తీసుకేళ్లేది. అంతేకాకుండా.. తన భర్త చితాభస్మాన్ని రోజు కొద్దీ కొద్దిగా తినటం ప్రారంభించిందట.. అలా తిన్నపుడల్లా.. తన భర్త తనతోనే ఉన్నాడన్న ఫీలింగ్ కలుగుతుందట... ఇలా కొంచెం కొంచెం తింటూ అలవాటు పడినట్లు.. తినేపుడు చితాభస్మం కుళ్లిన వాసన వచ్చినప్పటికీ.. భర్త పై ఉన్న ప్రేమతో తింటున్నానని" చెప్పుకొచ్చింది.
భర్త జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచి పెట్టడం ఇష్టం లేక.... నా భర్త నాతోనే ఉండాలన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నాని చెప్పుకొచ్చింది. బ్రిటన్ టీఎల్‌సీ ఛానెల్‌లోని 'మై స్ట్రేంజ్ అడిక్ట్' అనే షోలో కాసీ తన అలవాటు గురించి చెప్పగానే అక్కడున్నవారందరు షాక్ కి గురయ్యారు. ఆమె పై ఒక కథనం ప్రచురించటంతో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
Also Read: Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్ మిస్టేక్' అంటున్న రాంప్రసాద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook