All party meeting on Afghanistan crisis: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ని తమ వశం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను అక్కడి నుంచి రక్షించి భారత్ తీసుకురావడానికే భారత సర్కారు తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్థాన్‌ సంక్షోభంపై (Situations in Afghanistan) నేడు జరిగిన అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను ఆయన అఖిలపక్ష భేటీకి హాజరైన నేతలకు వివరించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : China and Talibans: తాలిబన్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన చైనా, దేశ పునర్నిర్మాణంలో చేయూత


ఈ అఖిలపక్షం భేటీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, ప్రహ్లాద్ జోషి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఎంతో మందిని అఫ్గానిస్థాన్‌ నుంచి సురక్షితంగా భారత్‌కి చేర్చామని చెప్పిన కేంద్ర మంత్రి జైశంకర్.. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నట్టు అఖిలపక్ష నేతలకు తెలిపారు. దోహా ఒప్పందంలో చేసిన ప్రమాణాలను తాలిబన్లు అతిక్రమించారని కేంద్రం అభిప్రాయపడింది. అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పడం కోసం 2020 ఫిబ్రవరిలో తాలిబన్లకు, అమెరికాకు మధ్య ఒప్పందం (Doha pact between Talibans and US) జరిగిన సంగతి తెలిసిందే.



Also read : Joe Biden: ఆగస్టు 31 లోగా బలగాల ఉపసంహరణ, తాలిబన్ల సహకారం అవసరమే


ఎన్సీపీ నేత శరద్ పవార్ (Sharad Pawar), రాజ్య సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గె, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, డిఎంకే నేత టీఆర్ బాలు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ, అప్నాదళ్ నాయకురాలు అనుప్రియ పటేల్ ఈ అఖిలపక్షం (All party meeting on Afghanistan crisis) భేటీకి హాజరైన వారిలో ఉన్నారు.