Men military uniforms attack civilians in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర బుర్కినా ఫాసోలో బుర్కినాబే మిలటరీ దళాల యూనిఫాం ధరించిన కొందరు వ్యక్తులు 60 మంది పౌరులను చంపేశారు. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్ ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న కొంత మంది జిహాదీలు.. మాలి దేశానికి సరిహద్దుల్లో ఉన్న యటెంగా ప్రావిన్స్‌లో గల కర్మ గ్రామంపై దాడికి తెగబడినట్లు స్థానిక  ప్రాసిక్యూటర్ లామిన్ కబోర్ తెలిపారు. ఏప్రిల్ 15న ఒవాహిగౌయా సమీపంలోని అదే ప్రాంతంలో సైన్యానికి, గుర్తుతెలియని దుండగులు జరిగిన పోరులో 40 మంది చనిపోయారు. మరో 33 మంది గాయపడ్డారు. 


2012 నుండి ఈ ప్రాంతంలో జిహాదీలు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. 2.5 మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. 2022 నుండి పౌరులపై జిహాదీల దాడులు మరింత పెరిగిపోయాయి. ఈ జిహాదీలంతా మాలీ నుండి వచ్చినవారే.


Also Read: Sudan Violence News: సుడాన్‌లో హింసాత్మక పరిస్థితులు.. భారతీయుల సేఫ్టీపై స్పందించిన భారత్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.