South Africa Mass Shooting: సౌతాఫ్రికాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. జోహెన్నెస్‌బర్గ్‌లోని సొవెటో టౌన్‌షిప్‌లో ఉన్న ఓ బార్‌లో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరు.. ఏ కారణాలతో ఈ దారుణానికి పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ బార్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 11 మందిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. దుండగులు ఓ మినీ బస్సులో బార్ వద్దకు వచ్చినట్లు తెలిసిందన్నారు. బార్‌లో మద్యం తాగుతూ వారు కూడా ఎంజాయ్ చేశారని... కానీ అంతలోనే ఒక్కసారిగా కాల్పులు జరిపారని అన్నారు. 


సంఘటనా స్థలాన్ని పరిశీలించాక అక్కడ కాల్పులు జరిపింది ఒక వ్యక్తి కాదని.. ఒక గ్రూప్ అని తెలిసిందన్నారు. ఒక్కసారిగా ఆ గ్రూప్ కాల్పులతో విరుచుకుపడటంతో బార్‌లో ఉన్నవారు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 


ఇటీవలి కాలంలో విదేశాల్లో కాల్పుల ఘటనలు కామన్ అయిపోయాయి. కాల్పుల మోతతో అమెరికా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల చికాగోలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జపాన్‌లో ఏకంగా మాజీ ప్రధాని షింజో అబేపై యమగామి అనే దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.ఈ కాల్పుల్లో అబే తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచ దేశాలను షాక్‌కి గురిచేసింది. 
 


Also Read: Pawan Kalyan: అధికార మదంతో అలా చేస్తే తాటా తీస్తా..వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక..!


Also Read: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర..రెండో టీ20లో ఆసక్తికర ఘటన..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook