Srilanka Protest: లంకలో రావణ కాష్టం..భగ్గుమన్న ఆందోళనకారులు..!
Srilanka Protest: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొన్నటివరకు ఆకలి కేకలతో అల్లాడిన లంకేయులు..తాజాగా హింస్మాకాండకు దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా వారి ఇళ్లపై దాడులు దిగుతున్నారు. దీంతో పరిస్థితి చేయి దాడిపోతోంది. ఆందోళన కారుల దాడిలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు.
Srilanka Protest: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొన్నటివరకు ఆకలి కేకలతో అల్లాడిన లంకేయులు..తాజాగా హింస్మాకాండకు దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా వారి ఇళ్లపై దాడులు దిగుతున్నారు. దీంతో పరిస్థితి చేయి దాడిపోతోంది. ఆందోళన కారుల దాడిలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ప్రస్తుత పరిణామాలకు బాధ్యతగా ప్రధాని రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఐనా ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. మహింద రాజపక్స, ఆయన బంధువుల ఇంటిపై ఆందోళనకారులు దాడులకు దిగారు. ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న రాజపక్స మ్యూజియాన్ని పగలగొట్టారు. మ్యూజియంలోని మైనపు విగ్రహాలను ధ్వంసం చేశారు.
అనంతరం రాజపక్స కేబినెట్‌లోని మంత్రుల ఇంటిపై దాడులకు దిగారు. ప్రధాని అధికారిక నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారిపై భాష్ప వాయువు ప్రయోగించి..ఆందోళనలకు చెదరగొట్టారు. మహీంద రాజపక్సను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆర్మీతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధ్యక్షుడి ఇంటిని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. వెంటనే వారిని సైన్యం అడ్డుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి ఇంటి వద్ద భద్రతను రెట్టింపు చేశారు. మాజీ ప్రధాని మహీంద రాజపక్సను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది.
మరోవైపు రాజపక్స(RAJAPAKSA) రాజీనామాతో కేబినెట్ రద్దైంది. దీంతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు పునుకున్నారు. వెంటనే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని అధ్యక్షుడిని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఆందోళనలు ఉధృతమవుతుండటంతో కర్ఫ్యూను పొడిగించారు. బుధవారం వరకు కఠిన నిబంధనలు ఉంటాయని అధికారులు తెలిపారు.
Also read:Ex Minister Narayana Arrest: పదోవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్టు
Also read:Nizamabad Accident: తెలంగాణలో మరో రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook