Sri Lanka Emergency: శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు తీవ్రంగా మారిపోతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచే ఈ ఎమెర్జెన్సీ అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా జారీ చేశారు. దేశ ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరా నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్రరూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం


శ్రీలంక దేశంలో గత కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ధరలు పెరిగిన నిత్యావసర వస్తువులను కొనేందుకు ముందుకు రాలేకపోతున్నారు. ప్రతి నిత్యావసర వస్తువుపై ధరలు భారీగా పెరగడం, ఆహార పదార్థాల కొరత, విద్యుత్‌ కోతలు, ఇంధన కొరతతో ఆ దేశ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వేలాది లంకేయులు ఆ దేశ అధ్యక్షుడైన గుటబాయ రాజపక్స నివాస భవానాన్ని చుట్టుముట్టారు. శ్రీలంక అధ్యక్ష పదవీ నుంచి రాజపక్స తప్పుకోవాలని ప్రజలంతా డిమాండ్ చేస్తూ.. భారీగా నిరసన చేపట్టారు. దీంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ను రిలీజ్ చేశాయి. ఈ క్రమంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇలాంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు.  


Also Read: Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?


Also Read: Donald Trump: పుతిన్‌ సాయం కోరిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook