Srilanka Crisis:  ఆర్థిక కష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. జనాగ్రహంతో ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. నిరసనకారులు ఎంటర్ కావడంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనం విడిచి పారిపోయారు. ఇప్పుడాయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. అయితే రహత్య ప్రాంతం నుంచి గొటబయ విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈనెల 20న శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజపక్స కుటుంబ పాలన వల్లే శ్రీలంకలో సంక్షోభం తలెత్తిందని భావిస్తున్న ప్రజలు.. వాళ్లపై తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు. అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేసినా జనాల కోపం చల్లారడం లేదు. రాజపక్స కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకుంటున్నారు. గొటబాయ రాజపక్స రాజీనామా సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్‌ రాజపక్స శ్రీలంకను విడిచి వెళ్లే ప్రయత్నం చేయగా ప్రజలు గుర్తించి అడ్డుకున్నారు. జనాగ్రహంతో తనపై దాడి జరుగుతుందని భావించిన బసిల్‌ రాజపక్స  దుబాయ్ పారిపోయేందుకు కొలంబో విమానాశ్రయం వచ్చారు. అయితే అక్కడ ఆయన్ని అడ్డుకున్న నిరసనకారులు వెనక్కి పంపించారు. శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా బసిల్ రాజపక్సకు  క్లియరెన్స్ ఇవ్వలేదు.


దేశం విడిచివెళ్లేందుకు దొంగ చాటుగా మంగళవారం అర్ధరాత్రి 12-15 గంటలకు కొలంబో విమానాశ్రయానికి వచ్చారు బసిల్ రాజపక్స. చెక్‌ఇన్‌ కౌంటర్‌కు వెళ్లారు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్లేందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మూడు గంటల పాటు ఎయిర్ పోర్టు కౌంటర్ దగ్గరే ఉన్నారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న నిరసనకారులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. బసిల్ రాజపక్సను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో  తాను దేశం వీడటం వీలు కాదని గ్రహించిన బసిల్ రాజపక్స.. కొలంబో ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికే అధ్యక్ష పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గొటబయ రాజపక్స.. బుధవారం అధికారికంగా రాజీనామా చేయనున్నారు. రాజీనామా తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే అరెస్ట్ ను తప్పించుకునేందుకు రాజీనామాకు ముందే దేశం విడిచి వెళ్లాలని గొటబయ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడం లేదని సమాచారం. తాను విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఇమ్మిగ్రేషన్ అధికారులపై గొటబయ రాజపక్స తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.


Read also: Hyderabad Rains: హైదరాబాద్‌కు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ..!


Read also: AP Flood: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండలా ప్రాజెక్ట్‌లు..ప్రమాద హెచ్చరికలు జారీ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook