Stop sale of Bikinis: ఆ బికినీల అమ్మకాల్ని నిలిపివేయాల్సిందే: ఆమెజాన్‌ను కోరిన శ్రీలంక
Stop sale of Bikinis: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెజాన్ విక్రయిస్తున్న ఆ ఉత్పత్తుల్ని నిలిపివేయాలని కోరింది. ముఖ్యంగా ఆ బికినీల అమ్మకాలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆ బికినీలు ఏవి..
Stop sale of Bikinis: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెజాన్ విక్రయిస్తున్న ఆ ఉత్పత్తుల్ని నిలిపివేయాలని కోరింది. ముఖ్యంగా ఆ బికినీల అమ్మకాలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆ బికినీలు ఏవి..
అమెజాన్ సంస్థ (Amazon) విక్రయాల్లోని కొన్ని రకాల వస్తువులపై శ్రీలంక ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కొద్దికాలంగా అమెజాన్ విక్రయాల్లో శ్రీలంక జాతీయ జెండా(Srilanka national flag) ముద్రించిన బికినీలు, లోదుస్తులు డోర్‌మ్యాట్‌లు, ఇంకా కొన్ని చైనా ఉత్పత్తులు దర్శనమిచ్చాయి. దాంతో శీలంక వ్యాప్తంగా ఆందోళన ప్రారంభమైంది. చైనా తయారుచేసిన ఈ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రెండ్రోజుల నిరసన అనంతరం ప్రభుత్వం రంగంలో దిగింది. తక్షణం జాతీయ జెండా ముద్రించిన బికినీ (Bikinis with srilanka flag) అమ్మకాల్ని సైట్ నుంచి తొలగించాలని అమెజాన్‌ను కోరింది. ఇలాంటి ఉత్పత్తులు అమ్మడం జాతీయ జెండాను, బౌద్ధ చిహ్నాలను అగౌరవపర్చినట్టేనని శీలంక భావిస్తోంది. బికినీలతో పాటు లోదుస్తులు, డోర్‌మ్యాట్స్ విక్రయాలు ఆపాలని విన్నవించింది.
అమెజాన్‌లో చైనాకు చెందిన పలువురు విక్రేతలు నాన్‌స్లిప్ డోర్‌మ్యాట్‌లను 10 నుంచి 24 డాలర్ల ధరకు, సింహం ఫోటో ముద్రించిన బ్రీఫ్‌లు , బికినీలను 9.20 డాలర్ల నుంచి 17.30 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఈ అమ్మకాలపై శ్రీలంక దేశస్థులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. శీలంక దేశాన్ని చైనా ఎలా పరిగణిస్తుందనేది దీని ద్వారా తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఓ వైపు అమెజాన్ సంస్థకు విక్రయాలు ఆపమని కోరుతూనే..ఈ రకమైన ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్ని ఆపాలని చైనా అధికారులను కూడా కోరింది. శ్రీలంక జాతీయ జెండాను దుర్వినియోగపర్చేలా ఉన్న అన్ని రకాల ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేయాలని కోరినట్టు చైనాలోని శ్రీలంక ఎంబసీ తెలిపింది. మరోవైపు వాషింగ్టన్‌లోని శ్రీలంక ఎంబసీ (Srilanka embassy) అధికారులు ఇదే విషయాన్ని అమెరికా ప్రభుత్వం(America government)దృష్టికి తీసుకెళ్లారు. శ్రీలంక దేశపు మేధో సంపత్తి హక్కుల్ని ఉల్లంఘించడమేనని ఫిర్యాదు చేసింది.
Also read: H1B visa issue: భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్, జో బిడెన్ కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook