చైనా విదేశాంగ మంత్రితో సుష్మా స్వరాజ్ భేటీ
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ కానున్నారు. డొక్లాంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతున్న వేళ.. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ కానున్నారు. డొక్లాంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతున్న వేళ.. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశం 15వ రష్యా-ఇండియా-చైనా (RIC) విదేశాంగ మంత్రిత్వశాఖ స్థాయి త్రైపాక్షిక సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయి వి లవ్రోవ్ సమావేశంలో పాల్గొనడానికి ఆదివారం నాడే న్యూఢిల్లీ చేరుకున్నారు. సమావేశంలో వీరు ముగ్గురు కలిసి సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చి.. ఉమ్మడి ప్రకటనలు చేస్తారు.
బ్రిక్స్ (BRICS)లో కీలక సభ్యులుగా ఉన్న ఈ మూడు దేశాలు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చిస్తారు. ప్రధానంగా తీవ్రవాద బెదిరింపులు, ఆఫ్ఘనిస్థాన్ మరియు పశ్చిమ ఆసియాల గురించి మరియు ఇతర తీవ్ర అంశాల మీద మాట్లాడుకుంటారు.
డొక్లాం ఉదంతం తరువాత చైనా ప్రతినిధిగా మంత్రి వాంగ్ యి భారత్ కు రావడం ఇదే తొలిసారి. వాంగ్ యి, సెర్గెయి వి లవ్రోవ్ తో కలిసి సుష్మా స్వరాజ్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు.
భారతదేశం ఎన్ఎస్జీ సభ్యత్వం, మసూద్ అజార్ నిషేధం, బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ (OBOR) లో భారతదేశం పాల్గొనడం వంటి అంశాలపై చైనా ఎడమొహం పెడమొహంగా ఉంది. గతంలో, ఆర్ఐసీ సమావేశాన్ని ఏప్రిల్ మాసంలో నిర్వహించారు.