తాలిబన్ల ఉగ్రపంజాకి 43 సైనికుల బలి
ఆఫ్ఘనిస్తాన్‌లో దక్షిణ కాందహార్ ప్రాంతంలో తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైనికులకు మధ్య జరిగిన ఎదురుదాడి కాల్పుల్లో 43 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనలో తాలిబన్లు రెండు సుసైడ్ కారు బాంబులను ఉపయోగించినట్లు సమాచారం. అయితే పరస్పరంగా జరిగిన కాల్పుల్లో 10 మంది తాలిబన్లు మరణించినట్లు తెలుస్తోంది. తాలిబన్లు ఈ దాడిని తామే చేసినట్లు ఇప్పటికే మీడియా స్టేట్‌మెంట్ అందించారు.
తూర్పు బల్క్ ప్రావిన్స్‌లో ఇప్పటికే తాలిబన్లు 6 పోలీసులను హతమార్చారు. 2014లో ఎప్పుడైతే అమెరికాకి చెందిన నాటో దళాలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయో, అప్పటి నుండి ఎప్పటికప్పుడు తాలిబన్లను ఎదుర్కోవడం ఆఫ్ఘన్ సైనికులకు సవాలుగా మారుతోంది.
ఇదే వారంలో జరిగిన మరోదాడిలో తాలిబన్లు పోలీసు కాంపౌండ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై కూడా సూసైడ్ బాంబర్లను ప్రయోగించారు. ఆ ఘటనలో 74 మంది హతమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ మురాద్ ఆలీ మురాద్ మాట్లాడుతూ, ఈ దాడిని ఈ సంవత్సరంలోనే అతిపెద్ద టెర్రరిస్టు ఎటాక్‌గా అభివర్ణించారు.