Afghanistan: అఫ్గనిస్తాన్‌లో అరాచకాలు రోజురోజూకు మీతిమీరుతున్నాయి. తాలిబన్లు(Talibans) ఆక్రమించిన నాటి నుంచి అక్కడి మహిళల(Womens)కు రక్షణ లేకుండా పోయింది. అందుకే చాలా మంది మహిళలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీ(29)తో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌(Mazar-i-Sharif)లో వీరు హత్యకు గురయ్యారు. ఓ ఇంట్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయని తాలిబన్ల అధికార ప్రతినిధి ఖరీ సయ్యద్‌ ఖోస్త్‌ (Qari Saeed Khosti )తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sierra Leone: సియారా లియోన్‌లో ఘోర దుర్ఘటన..ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి!


ఈ వ్యవహారంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. చనిపోయిన నలుగురు కూడా హక్కుల కార్యకర్తలని సమాచారం. ఇటీవల తాలిబన్ల పాలన(Taliban government) మొదలయ్యాక.. ఓ మహిళా హక్కుల కార్యకర్త(women's rights activist) హత్యకు గురికావడం ఇదే మొదటిసారి! ఫ్రోజన్‌ సఫీ ఎకనామిక్స్‌ లెక్చరర్‌గానూ పని చేసినట్లు సమాచారం. ‘'మేం దుస్తులను బట్టి ఆమెను గుర్తించాం. బుల్లెట్లు ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాయి'’ అని సఫీ సోదరి రీటా కన్నీటిపర్యంతమయ్యారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook