కాబూల్ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఘజ్ని ప్రాంతంలో యుఎస్ విమానం కూలిపోయిందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ మరణించారని తాలిబాన్ పేర్కొంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని గంటల తర్వాత తాలిబన్ స్పందించింది. ఘజ్ని ప్రావిన్స్‌లో డెహ్ యాక్ జిల్లాలో సదోఖేల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మంటల్లో మండుతున్న విమానం నుంచి ప్రయాణికులను రక్షించడానికి సమీప గ్రామ ప్రజలు ప్రయత్నించారని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధికారులు  తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కుప్పకూలిన విమానం యూఎస్ఏ  మిలిటరీ విమానమని, వాణిజ్యపరమైన విమానం కాదని, సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై తాలిబన్ ఖండించగా, ఏరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ.. ఎటువంటి వాణిజ్యపరమైన విమానం ప్రమాదానికి గురికాలేదని, అన్నీ విమానాల వివరాలు నమోదు చేశామని వివరణ ఇచ్చింది. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఆందోళనలకు గురికావద్దని సూచించింది. 


ప్రమాదం జరిగిన విమానం, ఘజ్ని ప్రావిన్స్ లోని గ్రామీణ ప్రాంతాలు చాలా వరకు తాలిబన్ల ప్రభావంతో వారి నియంత్రణలో ఉన్నందున ఇటువంటి భయానక పరిస్థితుల మధ్య అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేనందున ప్రథమిక సమాచారం అందటానికి ఆలస్యమైందన్నారు. మిలిటరీ విమానాలు, ముఖ్యంగా హెలికాఫ్టర్లు అప్ఘన్ ప్రాంతంలో కూలిపోవడం సాధారణంగా జరుగుతుందని  సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..