Talibans Press Meet: మహిళలకు, విదేశీయులకు పూర్తి రక్షణ
Talibans Press Meet: ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తొలిసారిగా మీడియా మందుకొచ్చారు. కీలక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఆందోళన కల్గిస్తున్న పలు అంశాలపై వివరణ ఇచ్చారు. తాలిబన్ల మీడియా సమావేశంలో ముఖ్య విశేషాలివీ
Talibans Press Meet: ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తొలిసారిగా మీడియా మందుకొచ్చారు. కీలక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఆందోళన కల్గిస్తున్న పలు అంశాలపై వివరణ ఇచ్చారు. తాలిబన్ల మీడియా సమావేశంలో ముఖ్య విశేషాలివీ.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) 20 ఏళ్ల అనంతరం తిరిగి తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ఆఫ్ఘన్ సైన్యంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించిన తాలిబన్లు తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. కీలక అంశాలపై..ముఖ్యంగా తాలిబన్లు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆందోళన రేపుతున్న అంశాలపై వివరణ ఇచ్చారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడారు.(Talibans Press Meet)
20 ఏళ్ల అనంతరం విదేశీ సైన్యాన్ని తరిమి కొట్టామని..అంతర్గతంగా, బయట్నించి శత్రుత్వం కోరుకోవడం లేదని తాలిబన్లు(Talibans) స్పష్టం చేశారు. దేశంలో మహిళల హక్కులకు ఎలాంటి భంగం రానివ్వమన్నారు. దేశంలో అందరినీ క్షమించామని..ఎవరిపైనా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవన్నారు.ఆఫ్ఘన్‌లో ఇతర దేశీయలకు ఎలాంటి హాని కల్గించమని..కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport)లో ఉన్నవారు వెనక్కి రావాలని కోరారు. ఇస్లామిక్ చట్టాల పరిధిలో మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని, ఏ విధమైన వివక్ష ఉండదని తెలిపారు. వైద్య, ఇతర రంగాల్లో మహిళలు పనిచేయవచ్చని స్పష్టత ఇచ్చారు. మీడియాపై సైతం ఆంక్షలు ఉండవన్నారు. అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాల్ని కొనసాగించాలని ముజాహిద్ చెప్పారు.అయితే మూడు ముఖ్య సూచనలు చేశారు.ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ప్రసారాలు ఉండకూడదని..నిష్ఫక్షపాతంగా ఉండాలని సూచించారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ ప్రసారం ఉండకూడదన్నారు. ఆఫ్ఘన్ ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Also read: Madras High Court: సీబీఐ పంజరంలో ఉన్న చిలుకే, మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook