Talibans: ఇండియాతో మాకు ఏ విధమైన ముప్పు ఉండదు : తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు ఇండియాపై సానుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మొన్న ఇండియాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలు అవసరమన్న తాలిబన్లు..ఇవాళ మరో ప్రకటన విడుదల చేశారు.
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు ఇండియాపై సానుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మొన్న ఇండియాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలు అవసరమన్న తాలిబన్లు..ఇవాళ మరో ప్రకటన విడుదల చేశారు.
తాలిబన్లు (Talibans)ఇండియా అనుకూల వైఖరి అవలంభించేట్టు కన్పిస్తున్నారు. ఆఫ్ఘన్‌ను వశపర్చుకున్న తరువాత వరుసగా ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇండియాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలు కోరుకుంటున్నట్టు చెప్పిన తాలిబన్లు ఇవాళ మరోసారి అదే కోణంలో మాట్లాడారు. ఇండియా నుంచి తమకు ఎలాంటి ముప్పు ఉండబోదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు ప్రస్తావించారు. ఆసియా ప్రాంతంలో ఇండియా కీలకమైన దేశమని..గతంలో కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయని చెప్పారు. తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కూడా అదే రీతిలో మంచి సంబంధాల్ని కోరుకుంటోందని తెలిపారు.
పాకిస్తాన్‌తో(Pakistan)కలిసి ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు తాలిబన్లు పాల్పడబోతున్నారనే వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు.ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాలిబన్లు ఇండియాకు ఎటువంటి హాని చేయరని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో ఆఫ్ఘన్‌కు(Afghanistan)సరిహద్దు బంధముందని..ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు, బంధుత్వమే ఉంటుందన్నారు. అన్ని దేశాలతోనూ మంచి దౌత్య సంబంధాలుండాలనేది(Diplomatic Relations) తమ అభిమతమన్నారు. ముఖ్యమైన అన్ని దేశాలు దౌత్య కార్యాలయాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
Also read: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగింపు, అమెరికా కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook