Talibans: ఇండియాతో సత్సంబంధాలే మా లక్ష్యం : తాలిబన్లు
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తరువాత తాలిబన్లు ఆసక్తికర ప్రకటన చేశారు. ఇండియాతో సత్సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తరువాత తాలిబన్లు ఆసక్తికర ప్రకటన చేశారు. ఇండియాతో సత్సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan)హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు, దౌత్య విధానాలపై దృష్టి పెట్టినట్టు కన్పిస్తోంది. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కీలక ప్రకటన చేశారు. ఇండియాతో సహా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను కోరుకుంటున్నామని తాలిబన్లు స్పష్టం చేశారు. ఇంకో దేశానికి వ్యతిరేకంగా తమ భూభూగాన్ని వాడుకునేందుకు అనుమతించమని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎంతో ముఖ్యమైన ఇండియా సహా అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఈ వార్త పాకిస్తాన్‌కు చెందిన ఏఆర్‌వై ఛానెల్‌లో ప్రసారమైంది. ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని..ఇండియా తన విధానాల్ని రూపకల్పన చేయాలని తాలిబన్(Taliban)అధికార ప్రతినిధి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసిస్-కే, తెహ్రీక్ ఇ తాలిబన్ వంటి సంస్థలు బలపడటంపై స్పందించారు. తమ భూభాగాన్ని మరో దేశానికి వ్యతిరేకంగా వాడుకునేందుకు అనుమతించమని..గతంలో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు.
Also read: US Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం, వడ్డరేట్లలో పెరుగుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook