ఇవాంకాకి చార్మినార్.. మోదీకి కాకతీయ కళాతోరణం
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరుకానున్న అతి రథమహారథులకు ఏఏ బహుమతులు ఇవ్వాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు కానున్న అతిరథ మహారథులకు ఏఏ బహుమతులు ఇవ్వాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు విచ్చేస్తున్న ఇవాంకా ట్రంప్‌కు చార్మినార్ నమూనాను బహుమతిగా ఇవ్వాలని టిఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాకతీయ కళాతోరణం నమూనాను బహుమతిగా ఇవ్వాలని నిశ్చయించింది. అలాగే సదస్సుకు హాజరుకానున్న మహిళా కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌కు వీణ, నిర్మలా సీతారామన్‌కు నెమలి నమూనాలను బహుమతిగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. కాగా సదస్సులో పాల్గొనే 170 దేశాల విదేశీ ప్రతినిధులకు కూడా గిఫ్ట్స్ అందజేస్తున్నది టీ-సర్కార్. అయితే గోల్కొండ హోటల్‌లో జరిగే విందులో టీ-సర్కార్ ఇవాంకాకు 'సర్ ప్రైజ్ గిఫ్ట్' ఇవ్వనున్నట్లు సమాచారం.