ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్  రాష్ట్రం క్వెట్టా పట్టణంలోని చర్చిలో కాల్పులు జరిగాయి. దుండగులు చర్చిలోకి ప్రవేశించి వెంట తెచ్చుకున్న తుపాకీలతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాల్పులు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. 'క్రిస్మస్' సమీపిస్తున్న నేపథ్యంలో క్రిస్టియన్లు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.


బలూచిస్తాన్ హోం మంత్రి, సర్ఫరాజ్ బగ్టి చర్చిని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు దాడికి తెగబడినట్లు ధృవీకరించారు. తాజా నివేదిక ప్రకారం, ఆదివారం కావడంతో చర్చిలో సుమారు 400 మంది.. అందులో ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు ఉన్నారు.