Princess of Japan Mako Marriage | జపాన్ దేశపు యువరాణి అంటా.. పెళ్లికి సిద్ధం అయిందంట. కానీ భయపడి ఆగిపోయిందంటా. పెళ్లంటే భయం కాదు. దానికి కారణం వేరేది ఉంది. జపాన్ రాకుమారి అయిన ప్రిన్సెస్ మాకో గత ఏడు సంవత్సరాల నుంచి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడాకి వేచి చూస్తోంది. కానీ కొన్ని నియమాల వల్ల వివాహం వాయిదా వేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!


జపాన్ లోని ( Japan) రాజవంశంలో ఉన్న నియమాలు, జపాన్ దేశ నియమాల ప్రకారం రాజకుటుంబం నుంచి కాకుండా మరో బయటి వ్యక్తిని యువరాణి మకో ( Princess Mako) పెళ్లి చేసుకుంటే తన ప్రిన్సెస్ స్టేటస్ కోల్పోనుంది. తరువాత వాళ్లు కూడా సాధారణ ప్రజల్లాగే బతకాల్సి ఉంటుంది. ఈ రూల్ తెలిసిన తరువాత పెళ్లికి భయపడి వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తోందటన యువరాణి.



Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…


యువరాణి మకో ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ తన వివాహాన్ని మరోసారి వాయిదా వేస్తున్నా అని తెలిపింది. 28 సంవత్సరాలు ఈ రాకుమారి 2017లో కూడా తన పెళ్లిని వాయిదా వేసింది. గతంలో పెళ్లి ( Marriage ) నుంచి తప్పించుకోవడానికి చదువుకుంటా అని చెప్పి బ్రిటన్ వెళ్లింది మకో. ఇక తన ప్రియుడి గురించి మాట్లాడితే అతని పేరు కై కోమురో ( Kai Komuro ) . అతను టూరిజం విభాగంలో విధులు నిర్వర్తిస్తుంటాడు. అతనికి స్కీయింగ్ కూడా వచ్చు. వయోలిన్ ప్లే చేయడం, వంట వండటం ఇష్టమట. యువరాణి అభిరుచులు కూడా అవేనని సమాచారం.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR